ప్రేమమ్ మూవీలో నాగ చైతన్య పిల్లాడి కేరెక్టర్




నాగ చైతన్యని తెరపై చూసి చాలా రోజులయ్యింది. అయితే ఏకకాలంలో రెండు ప్రాజెక్ట్ లలో నటిస్తుండడంతో ఈ గ్యాప్ అతని కెరీర్ పై పడదని అతని భావన. గౌతం మీనన్ దర్శకత్వంలో సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తూనే చందూ డైరెక్షన్ లో ప్రేమమ్ సినిమా ద్వారా తనకి అచ్చొచ్చిన లవర్ బాయ్ రోల్ చేస్తున్నాడు. 

అయితే మూడు విభిన్న వయసుల నడుమ పుట్టే ప్రేమను తెలియజేస్తూ తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమాలో చైతూ మేక్ ఓవర్ అందరినీ అలరిస్తుంది. ఇటీవలే మాసిన గెడ్డంతో తన టీచర్ శృతిహాసన్ సరసన కనువిందు చేసిన చైతూ పిక్స్ ని ఆరాధించడం పూర్తయ్యే లోపే సినిమాలో కీలకమైన రిసెప్షన్ ఫోటోని రిలీజ్ చేశాడు. 

అయితే ప్రస్తుతం స్కూల్ ఏజ్ లో జరిగే ప్రేమాయణంలో చైతూ చిన్నప్పటి లుక్ కోసం వేసిన మేక్ అప్ అందరినీ అలరిస్తుంది. గెడ్డాన్ని - మీసాన్ని పూర్తిగా తీసేసి తలని క్రమబద్ధంగా దువ్వడంతో ఒక్కసారిగా చూసిన వాళ్ళకి చైతూ చిన్నప్పటి పిక్ ఏమో అనిపించడం విశేషం. గుడ్ గోయింగ్ చైతూ.. 
ThanQ Visit Again.

Related Posts