పది సంవత్సరాల తర్వాత హాలీవుడ్ ఇండిపెండెన్స్ డే మూవీ రిలీజ్





ఇండిపెండెన్స్ డే ఏ ఏడాదైనా ఒకరోజే వస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మనం ఇక్కడ చెప్పుకునేది హాలీవుడ్ మూవీ ఇండిపెండెన్స్ డే గురించి. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం హాలీవుడ్ మూవీ ఇండిపెండెన్స్ డే విడుదలైంది. 1996 - జూలై 4న రిలీజ్ అయిన ఈ మూవీ.. ఓ సంచలనం. ఈ సినిమాను ఇప్పుడు చూసినా లేటెస్ట్ అనిపిస్తుందంటే.. ఏ రేంజ్ విజువల్స్ తో తెరకెక్కించారో అర్ధమవుతుంది. 

గ్రహాంతరవాసులు అమెరికా మీద దాడి చేస్తే.. వారి నుంచి కాపాడుకోవడానికి అమెరికా ఏం చేసింది?.. సింపుల్ గా స్టోరీ లైన్ ఇదే. కానీ దీన్ని తెరకెక్కించే విధానంలోనే ఇండిపెండెన్స్ డే సక్సెస్ సాధించింది. ఇప్పుడు మరోసారి ఇండిపెండెన్స్ డే రిజర్జెన్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ఇరవై ఏళ్లలో అమెరికా బాగా డెవలప్ అయింది కదా. ఆ ఛేంజ్ ప్రతీ ఫ్రేమ్ లోనూ ఉంటుందన్న మాట. అయితే.. ఈ టైంలో ఎలియన్స్ కూడా బాగా డెవలప్ అవుతారనే పాయింట్ ని మిస్ కాలేదు యూనిట్. 

గతంలో అమెరికాకి స్వాతంత్ర్యం వచ్చిన రోజైన జూలై 4నే ఈ సినిమాను విడుదల చేయగా.. ఈ సారి ఓ పది రోజుల ముందే.. అంటే జూన్ 24 - 2016నే రిలీజ్ చేసేస్తున్నారు. అలా ఇండిపెండెన్స్ డే ఓ పది రోజులు ముందుకొచ్చిందన్న మాట. అయితే.. పాత సినిమాలో సూపర్ హీరో అయిన విల్ స్మిత్ ఇప్పుడు లేకపోవడం నిరుత్సాహపరిచే విషయం. రెమ్యూనరేషన్ పరంగా విల్ స్మిత్ ని భరించడం కష్టం కావడంతో.. అతని కేరక్టర్ ని చంపేసి జెస్సీ ఉషర్ ని తెచ్చుకున్నారు. 
ThanQ Visit Again.

Related Posts