Balakrishna 100th Movie Gautamiputra Satakarni Logo



నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రారంభానికి ఇవాళే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గౌతమీపుత్ర శాతకర్ణికి లోగో లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. హిస్టారికల్ థీమ్ తో విడుదల చేసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. 

ఓ ఎర్రటి జెండా దానిపై సూర్యుడి చిహ్నం సూర్యుడి మధ్యలో చేత  కత్తి బట్టి సింహంపై ఉన్న యోధుడు.. ఇదీ గౌతమీ పుత్ర శాతకర్ణి లోగో లుక్ గా ఇచ్చిన పోస్టర్ డీటైల్స్. భారత దేశంలో అత్యంత గొప్పవాడైన పోరాట యోధుడి గురించి ఎవరూ చెప్పని కథ అంటూ రాసిన డిస్క్రిప్షన్ కూడా ఆకట్టుకుంటుంది. NBK100 అంటూ వేసిన స్టాంప్ అయితే అదుర్స్ అనాల్సిందే. 

అంజనా పుత్ర క్రిష్ అంటూ.. దర్శకుడు క్రిష్ తనను తాను ఆ కాలంలోకి తీసుకెళుతున్నాడు. ఈ శాతవాహన రాజుల అందరి పేర్లు వారి తల్లి పేర్లతో కలిపి ఉంటాయి. అలా ఇన్విటేషన్ నుంచి అన్ని సందర్భాల్లో ప్రతీవారిని ప్రస్తావించినపుడు.. వారి తల్లి పేరుతో కలిపి సంబోధిస్తూ.. ఆసక్తి కలిగిస్తున్నాడు క్రిష్. 

ThanQ Visit Again.

Related Posts