Download Sardaar Gabbarsingh Mp3 Songs & Teaser @ MaTelugu.Com
Download Link - http://matelugu.com/site_sardaar-gabber_singh_2_mp3-songs_download.xhtml
ఈ టీజర్ లో ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు. అదేనండీ ఒక్క డైలాగ్ కూడా లేదు. కాని కేవలం తన లుక్ తో చంపేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్ కు ఈ టీజర్ తో పిచ్చెత్తించాడు. మైండ్ బ్లోయింగ్ గా ఉంది.
గుర్రం మీద.. బైక్ మీద.. పరిగెత్తుకుంటూ వస్తే.. ముఖానికి ఎర్రటి తువాలును మాస్క్ గా వేసుకునన్న పవన్ కళ్యాన్.. దాన్ని సడన్ గా తీసేస్తే ఎలా ఉంటుంది? ఆ కిక్ ఎలా ఉంటుందో ఈ టీజర్ లో చూపించేశాడు. ప్రతీ విజువల్ లోనూ తన బాడీ లాంగ్వేజ్ తో చంపేశాడు. మనోడు డ్యాన్సు స్టెప్పులు వేస్తుంటే జబర్ దస్త్ కమెడియన్లు పూలు జల్లడం.. ఒక చెక్క గుర్రపు బొమ్మ మీదెక్కి పవర్ స్టార్ ఆడుకోవడం.. వామ్మో రచ్చ లేపేశాయీ విజువల్స్. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ అందించి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.
సింపుల్ గా చెప్పాలంటే.. ఈ టీజర్ చూస్తూ.. మాట్లల్లేవ్ అంతే. అరాచకంగా ఉంది అని చెప్పాలి. ఇంత మాంచి టీజర్ ను తీసినందుకు మన దర్శకుడు కె.ఎస్.రవీంద్రను అభినందించాల్సిందే.
పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే ఆ సందడి ఎలా ఉంటుందో అందరికీ బాగానే అర్థమవుతోందిప్పుడు. వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గురించే చర్చ. మొన్న మేకింగ్ వీడియోతో పండగ చేస్కున్న పవన్ ఫ్యాన్స్.. ఇప్పుడు ఆడియో టీజర్ చూసి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఈ సినిమాను తన అభిమానులకు అంకితమిస్తున్నట్లు పవన్ ఎందుకన్నాడో టీజర్ తో మరోసారి రుజువైంది. ఐతే మామూలు జనాల్లోనే కాదు.. పవన్ కు ఇండస్ట్రీలోనూ వీర లెవెల్లో ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ అభిమానుల్లో కొందరు.. ట్విట్టర్లో ‘సర్దార్..’ టీజర్ గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. మరి వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి...
‘‘దీనికి ఇంక ఆకాశమే హద్దు’’
-సాయిధరమ్ తేజ్
‘‘సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ అదిరింది. కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్’’
-నితిన్
‘‘హి ఈజ్ కమింగ్.. హి ఈజ్ స్పెషల్’’
-గోపీచంద్ మలినేని
‘‘హి ఈజ్ బ్యాక్ టు డు సంథింగ్.. పవర్ ఫుల్.. ఫన్.. యాక్షన్’’
-రామ్
‘‘ఎంట్రీ ఉంటే చాలు.. ఇంక ఎంటర్ టైన్ మెంట్ యాడ్ అయితే బంపర్ బోనస్ బొనాంజా.. పవర్ అవర్ బిగిన్స్’’
-వెన్నెల కిషోర్
‘‘ఆసమ్ స్టైలిష్ అండ్ పవర్ ప్యాక్డ్ టీజర్.. పవర్ స్టార్ సర్దార్.. కాంట్ వెయిట్ టు వాచ్ ఆన్ బిగ్ స్క్రీన్’’
-అనూప్ రూబెన్స్
