కొత్త ట్రెండ్ : టాలీవుడ్లో ఐటమ్ బాయ్స్




ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐటెం సాంగ్స్ కల్చర్ బాగా నడుస్తోంది. ఓ సినిమాలో ఏదైనా స్పెషల్  కోసం ప్రత్యేకంగా యాక్టర్స్ ను తీసుకుని.. వాళ్లతో ఫుల్ ఎనర్జీ ఇచ్చేలా మాస్ కంటెంట్ సాంగ్స్ చేయిస్తున్నారు. మొదట్లో ఐటెం గాళ్స్ అంటూ ప్రత్యేకంగా ఉన్నా.. ఆ తర్వాత టాప్ హీరోయిన్లే ఈ పాటలకు కూడా ఓకే చెప్పేస్తున్నారు.

బాలీవుడ్ లో అయితే దబాంగ్ 2 కోసం కరీనా కపూర్ ఫెవికాల్ సే అంటూ ఐటెంగా మారింది. సౌత్ లో తమన్నా అల్లుడు శ్రీను - స్పీడున్నోడు చిత్రాల్లో ఐటెం గాళ్ గా మారింది. శృతి హాసన్ ఆగడు కోసం ఐటెం అవతారం ఎత్తింది. ఈ లిస్ట్ పెద్దదే ఉంటుంది కానీ.. ఇప్పుడో కొత్త కాన్సెప్ట్ పై ఆలోచనలు జరుగుతున్నాయి. అదే 'ఐటెం బాయ్స్'. స్టార్ హీరోయిన్లు ఇలా వచ్చి ఓ పాటలో మెరిసి వెళ్లిపోయే సీన్స్ ను ఆడియన్స్ బాగానే ఆదరించారు. మరి సేం ఫార్మాట్ లో.. మంచి డ్యానర్స్ గా ఉన్న స్టార్ హీరోలు సినిమాలో ఎంట్రీ ఇచ్చి.. ఓ పాటలో డ్యాన్సులు కుమ్మేసి వెళ్లిపోతే ఎలా ఉంటుంది.?

రామ్ చరణ్ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాటకు స్టెప్పులేస్తే - సూపర్బ్ డ్యాన్సర్లయిన ఈ ఇద్దరు పక్కపక్కన చిందులేస్తే.. అదుర్స్ కదూ. ఎన్టీఆర్ తో కలిసి అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తే.. ఇక పోటీ పీక్స్ లో ఉంటుంది. ఇలాంటి ఐటెం బాయ్స్ కాన్సెప్ట్ పై ప్రస్తుతం తెగ చర్చలు నడుస్తున్నాయి. మరి దీనికి హీరోలు ఎంతవరకూ సపోర్ట్ ఇస్తారో చూడాలి.
ThanQ Visit Again.

Related Posts