గమనిక :-
ఏ ఒక్క మతాన్నో, ఏ ఒక్క దేవుడ్నోవిమర్శించడానికో , ఎవరి మనోభావాలనో దెబ్బ తీయడానికో వ్రాస్తున్నది కాదని, వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను.
దేవుడు ఎవరు ? అతను ఎలా వుంటారు ? అతను ఎక్కడ వుంటాడు ? అతను ఎం చేస్తుంటాడు ? ప్రతి ఒక్కరికి ఇలాంటి సందేహాలు వుంటాయి. ఈ ప్రపంచంలో వున్న ప్రజలు మతాలుగా విడిపోయి ఆ మత దేవుడ్ని పూజించుకుంటున్నారు. ఇందులో అభ్యంతరం లేదు ఎందుకంటే ఎవరి నమ్మకాలు వారివి అని సరిపెట్టుకోవచ్చు . వున్నారో, లేరో, వుంటే ఎక్కడ వున్నారో, ఎలా వుంటారో దేవుని కోసం మతాలుగా విడిపోయి ఆ మతాల ఆదిపత్యం కోసం మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు . మనిషి తీవ్రవాదం పేరిట , మూడ నమ్మకాల పేరిట ఈ ప్రపంచంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు . నిన్న పారిస్ లో జరిగిన ఉగ్ర దాడులు నుండి గోదావరి పుష్కరాల్లో చనిపోయిన భక్తులు వరకు చాలామంది మరణానికి మతమే కారణం అవుతున్న సంఘటనలు చుసిన నేను నా ప్రశ్నలనూ , నా అనుమానాలను, నా అనుభవాలను www.iamyourrealfriend.com లో నా మిత్రులందరితో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇది వ్రాస్తునాను.
దేవుడు ఎవరు ? అల్లనా ? జీసస్సా ? కృష్ణుడా ? బుద్దుడా ? ఎవరు ? ఎవరు దేవుడు ? అసలు ఈ ప్రశ్న నేనెందుకు వేస్తున్నానంటే దేవుడెవరో తెలియక నేను అయోమయం లో వున్నాను. జీసస్ దేవుడని కొంతమంది, అల్లా దేవుడని మరి కొంతమంది కాదు కృష్ణుడే దేవుడని ఇంకొంతమంది అంటున్నారు. అల్లా దేవుడు అయితే జీసస్ , కృష్ణుడు దేవుళ్ళు కారా ? పోనీ జీసస్ దేవుడు అయితే కృష్ణుడు, అల్లాలు దేవుల్లు కారా ? బుద్ధుడు ఎక్కడా నేను దేవుడ్నని కానీ, దైవ కుమారుడని కాని చెప్పినట్టుగా లేదు కాబట్టి బుద్దుని విషయం లో కొంత కన్ఫ్యూషన్ తగ్గింది. కానీ మిగతా ముగ్గురు విషయం లోనే నాకంత అయోమయంగా వుంది. పోనీ ముగ్గురూ దేవుళ్ళే అంటే ప్రజలు ఒప్పుకుంటారా ? మల్లీ మా దేవుడే నిజమైన దేవుడని వాదిస్తారు. దేవుడు ఒక్కడేనా లేక ఆ ముగ్గురు దేవుల్లేనా ? హై స్కూల్ విద్యార్ది అడిగినంత అమాయకంగా వుందా ఈ ప్రశ్న ? నిజమే ఈ విషయంలో నేను హై స్కూల్ విద్యార్ది కి ఉన్నంత అయోమయం లో వున్నాను. నాలా మీలో ఎవరైన వున్నారో లేదో నాకు తెలిదు. ఈ ప్రశ్న అసలు ఎవర్నీ అడగాలో నాకు తెలియదు. చట్టాన్ని అమలు పరుస్తున్న పోలీస్ అఫీసర్ ని అడుగుదామంటే సదరు పోలీస్ ఆఫీసుర్ కూడా ఈ ముగ్గురిలో ఒకర్ని దేవుడిగా పూజిస్తున్నవాడే. పోనీ న్యాయమూర్తిని అడగాలన్నా అక్కడా అదే సమస్య. టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్ట్ లు, ఇంజనీర్లు ఒకరేమిటి ఏ వ్రుత్హిలో ఉన్నవారిని ఈ ప్రశ్న అడగాలన్నా కుదరదు. ఎందుకంటే సదరు వృత్తి లో వున్నవారు ఎదో ఒక మతాన్ని అనుసరిస్తున్నవాళ్ళే. ఎదో ఒకరిని దేవునిగా పూజిస్తున్నవారే. మరి ఎవరిని అడగాలి ? ఎవరు దీనికి జవాబు చెప్పగలరు ? అసలు నాకే ఈ ప్రశ్న ఎందుకడగాలని అనిపిస్తుందంటే తెల్లవారి న్యూస్ పేపర్ వస్తే చాలు. ఎక్కడో ఒకచోట ఉగ్రవాదుల మత ఘర్షణలు, కుల పోరాటాలు, చిల్లంగి చేతబడులు పేరు మీద బౌతిక దాడులు అన్ని దేశాల్లో ఇదే తంతు. అసలు వున్నారో లేరో, వుంటే ఎలా ? ఎక్కడ వున్నారో తెలియని దేవుని కోసం మతాన్ని సృష్టించి ,, ఆ మతం పేరు మీద మారణ హోమాన్ని సృష్టిస్తున్న ఉగ్రవాదులు ఒకవైపు ఐతే , పుష్కరాల్లో కొంతమంది, సబరిమాలలో, ఉత్తరకాండ లో ఇలా చెప్పుకుపోతే ఎంతోమంది చనిపోతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది ? శాస్త్రియ జ్ఞానాన్ని ఇప్పించవలసిన ప్రభుత్వాలే పుష్కరాన్ని, అన్నీ మతాల పండగల్ని ఎంకరేజ్ చేయడం , ప్రజలని ముందుండి నడిపించాల్సిన మీడియా కూడా జ్యోతిష్యం,
న్యూమరాలజి ఇలా రకరకాలయిన పేర్లతో ప్రజల్లో మూడనమ్మకాలను కలిగించడం ఎంతవరకు సబబు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు దేవుడెవరో తేల్చాలని మన వెబ్సైటు ద్వారా డిమాండ్ చేస్తున్నాను.
మనల్ని సృష్టించింది దేవుడేనా ? 84 లక్షల జీవరాసులని, వృక్షాలని, సరస్సుల్ని, నరుల్ని, సముద్రాన్ని, మహా సముద్రాన్ని, పర్వతాల్ని, లోయల్ని, ఈ భూమిని , సూర్యుడ్ని, నక్షత్రాలని, మన సౌర కుటుంభాన్ని 94 మూల పదార్దాల్ని విశ్వం లో 96 % వున్నా డార్క్ ఎనర్జీ ని , డార్క్ మాటర్ ని సృష్టించింది మనిషి మాత్రం కచ్చితంగా కాదు. మరి దేవుడు సృష్టించారా ? ఈ విశ్వాన్ని మనిషి సృష్టించలేదు ఎందుకంటే ఈ విశ్వం పుట్టి 1500 కోట్ల సవత్సరాలు ఐతే మనిషి పుట్టి కేవలం 20 లక్షల సంవత్సరాలు మాత్రమే. ఆ మనిషి ఉండే భూమి పుట్టి 45౦ కోట్ల సవత్సరాలవుతుంది. కాబట్టి ఈ విశ్వాన్ని మనిషైతే మాత్రం కచ్చితంగా సృష్టించలేదు, దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించలేదు అనటానికి రుజువులు ప్రస్తుతానికి లేవు. ఎందుకంటే ఎవరు సృస్టించకుండా విశ్వం తనంతట తానే సృష్టించుకోలేదు కదా ? కానీ ఎవరో సృష్టించి వుండాలి. వారెవరు ? కచ్చితంగా దేవుడే అయితే ఈ విశ్వాని సృష్టించే దేవుడు ఎవరు ? అల్లానా ? జిసస్సా ? కృష్ణుడా ?