అమెరికా రోబో రికార్డును బద్దులు కొట్టిన చైనా రోబో

అమెరికా రోబో రేజంర్‌ రికార్డునుచైనా రోబో బద్దలు కొట్టింది. 54 గంటల్లో 134 కి.మీ. నడిచి గిన్నిస్‌ ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించింది. గతంలో అమెరికా రోబో 30 గంటల్లో 65 కిలీమీటర్లు నడిచి గిన్నిస్‌లో చోటు సాధించగా ఆ రికార్డును చైనా రోబో చెరేసింది. చైనాలోని చాంగ్‌క్వింగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పోస్ట్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌కు చెందిన పరిశోధకులు జంతువును పోలిన విధంగా నాలుగు కాళ్ల రోబోను తయారు చేశారు. దీనికి జింగ్‌ఝె నెంబర్‌ 1 అని పేరు పెట్టారు. అక్టోబరు 24, 27 తేదీల మధ్య 134 కిలోమీటర్ల దూరానిన 54 గంటల సమయంలో నడించింది. గంటలకు 0.8 కిలోమీటర్ల వేగంతో ఈ దూరాన్ని అధిగమించింది. తద్వారా అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన రెంజర్‌ రోబో కన్నారెండురెట్లు అధిక దూరాన్ని నడిచి జింగ్‌ఝె నెం 1 ఈ రికార్డును సాధించింది. ఈరోబోను తయారీని ఏడాదిలోగా పూర్తిచేశామని చైనా పరిశోధకుడు ప్రొఫెసర్‌ లీ క్వింగ్‌డు తెలిపారు.
ThanQ Visit Again.

Related Posts