Tollywood cinema yesteryear’s famous comedian Kallu Chidhambaram garu passed away in care hospital today. He is suffering with illness. he was born on October 10 1945. Chidambaram started his career with Kallu movie, after this film chidambaram name turned as Kallu chidambaram. He got good fame with Ammoru movie which was directed by Kodi Ramakrishna. He was acted in more than 300 films in any language. Chidambaram turned full time comedian from sv Krishna Reddy, Evv SatyaNrayana movies. He acted his last movie in the year of 2013.
[caption id="attachment_384" align="aligncenter" width="720"]
కళ్ళు చిదంబరాన్ని చంపిందెవరు?
నిజమే .ఆరోగ్యం సహకరించక కళ్ళు చిదంబరం కనుమూసి ఉండొచ్చు. కానీ కాస్త వెనకకు వెళ్ళి మూలాలను ఓ సారి పరిశీలిద్దాం. అక్కడ దొరుకుతాయ్ కళ్ళు చిదంబరం మరణం వెనుక ఉన్న కొన్ని బయటికి తెలియని కారణాలు. వాస్తవానికి ఆయన పేరు కళ్ళు చిదంబరం కాదు.కొల్లూరి చిదంబరం, కానీ తన మొదటి సినిమా పేరు కళ్ళు. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. దీన్ని బట్టి తెలుస్తుంది . సినిమా ప్రపంచం పై ఆయనకున్న ఇష్టం. స్వఛ్చమైన కామెడీని అందించి అందరినీ నవ్వించిన అతనికి ఈ మద్యకాలంలో అసలు అవకాశాలే రాకుండా పోయాయ్. నటించడానికి ఓపిక ఉంది, నటనలో పర్ఫెక్షన్ ఉంటుంది.. అసలు ఆయన ఫేస్ చూస్తేనే జనాలు నవ్వేస్తారు. అయినా నటించడానికి ఎందుకు అవకాశాలు రాలేదు?? రెండు ఊత పదాలను ఊదుకుంటూ కమెడీయన్స్ మంటూ ఇండస్ట్రీ లో చక్రం తిప్పుతున్న వారితో పోల్చితే కళ్ళు చిదంబరం ఎక్కడ తక్కువగా కనపడ్డాడు.. మన దర్శక నిర్మాతలకు. మంచి పేరు వచ్చిన తర్వాత కూడా సినిమాల్లో నటించే అవకాశం కోసం ప్రతి గడప తొక్కాడని సమాచారం. అయినా అతనికి ఛాన్స్ రాలేదంట. పూట గడవని పరిస్థితుల్లో కుటుంబం కొట్టుమిట్టాడుతున్న అతను ఇంకా సినిమా రంగాన్నే నమ్ముకున్నాడంటేనే తెలుస్తుంది తను నమ్మిన రంగమే తనను బతికిస్తుందని ఎంతగా నమ్మాడో అని. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇవన్నీ పక్కన పెడితే వారం రోజులుగా ఓ వార్త సోషల్ మీడియా చక్కర్లు కొడుతూనే ఉంది. ప్రాణాపాయ స్థితిలో కళ్ళు చిదంబరం ..సహాయం చేసి ఆదుకోండి అంటూ..అయినా ఎవ్వరూ కనికరించలేదు. కళాకారుల సంక్షేమం కోసమే మేము అంటూ ఎన్నికల్లో నిలిచి గెలిచిన మా( మూవీ అసోసియేషన్ ) కూడా అటు వైపు కన్నెతి చూడలేదు. ఇప్పుడు చెప్పండి చిదంబరం చనిపోయాడా..? లేక మనవాళ్లే అతనిని-----------------!!!