భయపడుతున్న బాబు

ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ వుంటాయి. మంచిని పొగడాలి. చెడుని విమర్శించాలి.
మన www.iamyourrealfriend.com వెబ్సైట్ ఏ వ్యక్తికిగాని, పార్టీ కి కానీ అనుకూలమూ కాదు , అలా అని వ్యతిరేకము కాదు. ఎవరి ప్రైవేట్ జీవితాలు వారిని పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అన్న శ్రీ శ్రీ గారి మాటల ప్రకారం మా ప్రశ్నలు, విమర్శలు వుంటాయి . అలా అని కేవలం విమర్శలే కాకుండా ఆ వ్యక్తుల గొప్పతనాన్ని , మంచితనాన్ని కూడా పోగుడుతాము. విమర్సలెప్పుడు నిర్మాణాత్మకంగా వుండాలి అన్నదే మా వెబ్ సైట్ ఉద్దేశ్యం. విమర్సించడానికైనా మెచ్చుకోవడానికైనా నేనెవర్ని అంటారు. I am your real friend
సలహా : - ప్రజలతో మమేకామై నిరంతరం ప్రజల కష్ట సుకాలలో పాలు పంచుకునే మీ మనస్తత్వం చాల ఆదర్సవంతమైంది. దీనిని కొనసాగించండి.



chandra babu naidu


చంద్రబాబు నాయుడు మూడు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అపర చానుక్యునిగా పేరు పొందారు. ఎన్ .టి.ఆర్ లాంటి మహావ్యక్తి ని వెన్నుపోటు పొడిచిన, తదనంతరం ఎన్.టి.ఆర్ చనిపోయినా ప్రజల్లో నెగిటివ్ ఫీలింగ్ రాకుండా చేసుకోగలిగిన అపర మేధావి. ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయికి తీసుకుపోగలిగిన తెలివితేటలూ అతని సొంతం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ని అద్భుతంగా వుపయోగించుకోగలిగిన ఆంధ్ర బిల్ గేట్స్ అతను. నేను ముఖ్యమంత్రిని కాదు నేను సి.ఇ.ఓ ను అని చెప్పుకునే ముఖ్యమంత్రి అతను. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని అత్యుత్తమ రాజధానిగా తయారుచేయుటకు కృషి చేస్తున్న కృషీవలుడతను. నిరంతరం పని..పని..పని.. తాను నిద్ర పోనని ఎవర్ని నిద్ర పోనివ్వనని అధికారులను పరుగులు పెట్టించే డిక్టేటర్ అతను. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా మరలా 15 నెలలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు.
1. ప్రత్యేక హోదా విషయంలో మీరు ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోయారు ? ఓటుకు నోటు కేసులో అరెస్ట్ కు బయపడుతున్నారా ?
2. తోటపల్లి ప్రాజెక్ట్ కు మీరు శంకుస్థాపన చేయడం నిజమే కాని శంకుస్థాపన చేసిన చోట రెండు నెలల్లోనే మీరు పదవిని కోల్పోయారు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో వున్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యి 15 నెలలు అవుతుంది. ఈ పదిహేను నెలల్లో మీరు ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయగలిగారా ?
3. ప్రభుత్వంలో ఏ పదవీ లేని లోకేష్ మంత్రులతో విదేశాలు అధికారికంగా ఎలా పర్యటిస్తారు ?
4. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన మీరు ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన మీరు నైతిక బాధ్యతగా పదవికి రాజీనామా చేయవలసిన అవసరం లేదా ?
5. వృద్ధ్యాప్య పెన్షన్ 10౦౦/- పెంచారు చాల మంచి నిర్ణయం కాని కొన్ని లక్షలమందికి పెన్షన్లు తొలగించడం న్యాయమా ?
6. మేక్ ఇన్ ఇండియా అన్న నినాదం ఇచ్చిన మోడీ ప్రభుత్వం లో భాగస్వామ్యం గా వున్నా మీరు మన రాజధాని నిర్మాణానికి డిజైన్ సింగపూర్ నుండి తీసుకురావడం అవమానంగా అనిపించడం లేదా ?
7. పట్టిసీమ ప్రాజెక్ట్ కు సంబంధించిన జి.వో లో రాయలసీమ ఊసెత్తకుండా రాయలసీమకు నీరు ఇస్తాననడం అబద్ధం కాదా ?
8. రాజధాని రైతులు ఎంత మొత్తుకున్నా వారి భూములు తీసుకోవడం కోసం జి.వో సహితం జారి చేసిన మీరు పవన్ కళ్యాణ్ ఒక్క మీటింగ్ పెట్టేసరికి మిత్ర ధర్మాన్ని గౌరవిస్తూ భూములు తీసుకోనన్నారు. అంటే వందలాదిమంది రైతుల బాధకంటే పవన్ కళ్యాణ్ ఒక్క హెచ్చరిక మిమ్మల్ని భయపెట్టిందా ? మిత్ర ధర్మాన్ని గుర్తు చేసిందా ?
9. మీ ఎం.ఎల్.ఎ వనజాక్షి అనే ఎం.ఆర్.వో మీ దాడి చేస్తే కేసు పెట్టకుండా సెటిల్మెంట్ చేయడం సి.ఎం హోదా ను భంగం కలిగించినట్టు కాదా ? అవినీతిపరుల గుండెల్లో నిద్రపోవడం అంటే ఇదేనా ?
10. రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇది మీ ఇంటి కార్యక్రమం అనుకున్నరా ? ప్రతిపక్ష నాయకుల్ని పిలవకపోవడం దారుణం కాదా ?
11. హైదరాబాద్ ని నేనే అభివృద్ధి చేసానని గొప్పలు చెప్పుకునే మీరు రాష్ట్ర ప్రజలంతా కడుతున్న పన్నులలో ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తెలివితక్కువతనం కాదా ? అది కుడా ఈరోజు కాకపోయినా రేపు అయిన తెలంగాణా విదడిపోతుందని తెలిసి కూడా మీరు అవన్నీ ఎలా చేసారు ?
12. బిల్ గేట్స్ ను బిల్ క్లింటన్ ను ఆంధ్రకు తెచ్చాను అని గొప్పలు తెచ్చుకునే మీరు మా దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి వుంటే జైలు లో అయినా పెట్టేస్తాం లేదా పిచ్చాసుపత్రి లో చేరుస్తాం అని మలేషియా మంత్రి అన్న విషయాన్నీ ఎందుకు చెప్పుకోరు ?
13. నరేంద్ర మోడీ హవాలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ లో జగన్ మీద 2 % వోట్ల తేడ తో గెలిచిన మీరు నయతికంగా గెలిచినట్టేనా ? ఎందుకంటే పవన్ కళ్యాణ్ వలన కనీసం మీకు 25 లక్షల ఓట్లు పడునటాయి . జగన్ కంటే మీకు ఎక్కువ వచ్చిన ఓట్లతో మీరు ఓడిపోయి ఉండేవారన్నది నిజం కాదా ? నరేంద్ర మోడీ తో పొత్తు పెట్టుకోకుంటే మీ పరిస్థితి ఏమిటి ?
14. నేను రెండుసార్లు లెటర్స్ ఇచ్చినందుకే కేంద్రప్రభుత్వం లెటర్ ఇచ్చినదని తెలంగాణా లో రాష్ట్రాన్ని విడగొట్టే పాపం కాంగ్రెస్ దని ఆంధ్రా లో రెండు నాల్కల ధోరణి మీరు ఆచరించడం నిజం కాదా ?
15. ఓటుకు నోట్లు కేసులో నా ఫోన్ ట్యాపింగ్ చేసారని ఆరోపిస్తున్నారు కానీ మీ ప్రమేయం లేకుండానే రేవంత్ రెడ్డి డబ్బు ఇస్తే అతన్ని పార్టీ నుండి ఎందుకు బహిష్కరించలేదు ?
16. కె .సి.ఆర్ మా నాయకుల్ని లాగేసుకుంటున్నారని ఆరోపిస్తున్న మీరు అదే పని ఆంధ్రా లో వై .స్.ఆర్ సి.పి నాయకుల్ని ఎందుకు లాగేసుకుంటున్నారు?
17. మంత్రి నారాయణ కాలేజి లో 11 మంది విద్యార్దినులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆయన్ని మంత్రి వర్గం లో ఎలా కొనసాగిస్తున్నారు ?
18. రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో ఇంతవరకు ప్రిన్సిపల్ బాబురావు ను అరెస్ట్ చేయకపోవడం ఏమిటి ?
19. వై.స్.ఆర్ బ్రతికి వుంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకునేవారు . మీరు ఆ పని చేయలేకపోవడానికి కారణం ఏమిటి ?

ఉపసంహారం : - ఏది ఏమైనా మీరు ముక్యమంత్రిగా వున్నారు. గతంలో కాకుండా ఈసారి అయిన మీరు ప్రజలను దృష్టిలో పెట్టుకుని సంక్షెమ కార్యక్రమం చేపట్టాలని మీరు రాష్ట్రాన్ని నం.1 స్థానానికి తెసుకురగాలలిగే శక్తీ సామర్ధ్యాలు మీకు వున్నాయని నమ్ముతున్నాం .
ThanQ Visit Again.

Related Posts